: టీఆర్ఎస్ కార్యకర్తల బస్సులో మంటలు!
వరంగల్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు బస్సులో వెళుతున్న పార్టీ కార్యకర్తలకు తృటిలో ప్రమాదం తప్పింది. భువనగిరి బైసాసు వద్దకు చేరుకోగానే బస్సు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, డ్రైవర్, బస్సులోని కార్యకర్తలు తక్షణం స్పందించడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేశారు.