: ప్రభాస్ కు కార్లంటే మహా మోజు.. ‘బాహుబలి’ వద్ద అద్భుతమైన మూడు కార్లు!
‘బాహుబలి’ ప్రభాస్ కు కార్లంటే మహామోజు. ఎంత మోజు అంటే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ కార్లలో ముఖ్యంగా.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, జాగ్వార్ ఎక్స్ జే, బీఎండబ్ల్యూ ఎక్స్ 3 ప్రభాస్ వద్ద ఉన్నాయి. ఆయా కార్ల ఖరీదు విషయానికి వస్తే.. మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ విలువ రూ.4 కోట్ల నుంచి రూ.8.5 కోట్ల వరకు ఉంది. అదే, లగ్జరీగా ఉండే స్పోర్టింగ్ వెహికల్ జాగ్వార్ ఎక్స్ జే విలువ సుమారు రూ.99 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇక, బీఎండబ్ల్యూ ఎక్స్ 3 విలువ రూ.44 లక్షల నుంచి రూ.49 లక్షల వరకు ఉంది. కాగా, ‘బాహుబలి’ సినిమాతో ఓ రేంజ్ లో ప్రభాస్ పాప్యులారిటీ పెరిగిపోయింది. మరి కొన్ని గంటల్లో ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.