: మొబైళ్ల ద్వారా బాహుబ‌లి వీడియోల‌ను షేర్ చేయ‌కండి: దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ విజ్ఞప్తి


ఎంతో మంది శ్ర‌మ‌ప‌డి, భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమా పైర‌సీ బారిన ప‌డుతుందేమోన‌ని ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నో కొత్త సినిమాలలోని కీల‌క సీన్లు.. చిత్రం విడుద‌ల కాగానే మొబైల్ ఫోన్ల ద్వారా సామాజిక మాధ్య‌మాల్లో భారీగా షేర్లు అవుతుండ‌డంతో ఇప్పుడు ఈ అంశంపైనే అధికంగా భ‌యం ప‌ట్టుకుంది. ఈ అంశంపైనే స్పందించిన యువ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ సినీ అభిమానుల‌కు ఓ విన్న‌పం చేశాడు. మొబైళ్ల ద్వారా బాహుబ‌లి సినిమాను షేర్ చేయ‌కూడ‌ద‌ని, బిగ్ స్క్రీన్ల‌పైనే బాహుబ‌లిని ఎంజాయ్ చేయాల‌ని ఆయ‌న కోరాడు.  


  • Loading...

More Telugu News