: ‘మిస్ యూ అమర్’ అంటూ రిషికపూర్ సంతాపం
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఈ రోజు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తన సహనటుడి మృతిపై మరో సీనియర్ నటుడు రిషికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సుమారు ముప్ఫై తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోని’ గురించి ప్రస్తావిస్తూ రిషికపూర్ ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్స్ ను వరుసగా వినోద్ ఖన్నా, రిషికపూర్, అమితాబ్ బచ్చన్ లు పోషించారు. దానిని దృష్టిలో పెట్టుకునే ‘అమర్! నిన్ను మిస్సయ్యాను...’ అంటూ రిషి ట్వీట్ చేశారు.