: రాత్రికి రాత్రే 138 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన యోగి


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాత్రికి రాత్రే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలన, భద్రతా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసే ఫైల్ పై సంతకం చేశారు. ఏకంగా 138 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిలో 84 మంది ఐఏఎస్, 54 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు.

ట్రాన్స్ ఫర్ అయిన వారిలో ఏకంగా 38 మంది జిల్లా మేజిస్ట్రేట్లు (మన కలెక్టర్లను అక్కడ జిల్లా మేజిస్ట్రేట్ అంటారు), 33 మంది ఎస్పీలు ఉండటం గమనార్హం. లక్నో మేజిస్ట్రేట్ ప్రియదర్శిని కూడా ట్రాన్స్ ఫర్ కావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆమె స్థానంలోకి కౌశల్ రాజ్ శర్మను తీసుకొచ్చారు. బదిలీ అయిన వారిలో బరేలీ, కాన్పూర్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నారు.

ఐపీఎస్ అధికారుల విషయానికి వస్తే ఘజియాబాద్, లక్నో, షహరాన్ పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, ఘాజీపూర్, గోరఖ్ పూర్ ఎస్పీలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇదే అతి పెద్ద సంస్కరణగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

  • Loading...

More Telugu News