: బాహుబలి టికెట్లు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకుంటామా?...హైకోర్టు ఏమీ చెప్పలేదు!: తలసాని శ్రీనివాస్ యాదవ్
బాహుబలి సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చిందన్న వార్తలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఇలాంటి వార్తలు సరికాదని ఆయన సూచించారు. హైకోర్టు బాహుబలి నిర్మాతలకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్ఫష్టం చేశారు. మూడు నెలల క్రితమే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చిందని ఆయన తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ ఎవరైనా టికెట్ల ధరలు పెంచితే తీవ్రంగా పరిగణిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ధియేటర్ల యజమానులు గుర్తించాలని ఆయన సూచించారు. కాంబోప్యాక్ లు, బెనిఫిట్ షోలు అంటూ సినీ ప్రేక్షకులను దోపిడీ చేయడం తగదని ఆయన సూచించారు. అలాంటి ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఇలాంటి మోసాలు ఏవైనా జరిగితే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.