: ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, గోడ కట్టి తీరుతాం: డొనాల్డ్ ట్రంప్


ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరతామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికా-మెక్సికో మధ్య గోడ కట్టడం ద్వారా మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చని అన్నారు. ప్రపంచం ముందున్న అతి పెద్ద సమస్యలు మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణా అని, కానీ, ఈ అంశాలపై ఎవరూ మాట్లాడటం లేదని ట్రంప్ విమర్శించారు.

ఇటీవల తనని కలిసిన రక్షణ శాఖ కార్యదర్శి జాన్ కెల్లీ సైతం కచ్చితంగా ఓ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. కాగా, అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదని, ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News