: ‘బాహుబలి-2’ బెనిఫిట్ షోలకు అనుమతి లేదు: మంత్రి తలసాని
ఈ నెల 28న ‘బాహుబలి-2’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ చిత్రం బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు ఆయా థియేటర్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ లో ‘బాహుబలి-2’ మూవీ బెనిఫిట్ షోలు వేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే ఈ చిత్రం టికెట్లను, తిను బండారాలను విక్రయించాలని థియేటర్ల యజమానులను హెచ్చరించారు.