: బీజేపీ విజయానికి నా అభినందనలు : ఆప్ అధినేత కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండో స్థానంలో నిలిచింది. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆప్ అధినేత కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఎంసీడీ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి నిమిత్తం ఆయా కార్పొరేషన్లతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఎంసీడీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణం ఈవీఎంలేనని ఆప్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఈవీఎంల అంశాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించకపోవడం గమనార్హం.