: పశ్చిమబెంగాల్ లో కూలిన వంతెన... 65 మంది గల్లంతు


పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓడల్లోకి ఎక్కేందుకు నిర్మించిన చెక్క వంతెన (జెట్టీ) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 65 మంది గల్లంతయ్యారు. భంద్రేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. సముద్రంలోని భారీ అలల కారణంగానే వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు... సహాయక చర్యలను చేపట్టారు. మరోవైపు గల్లంతైనవారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. 

  • Loading...

More Telugu News