: విద్యా సంస్థలకు మంత్రి గంటా వార్నింగ్
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీలు, డీఈవోలు, ఆర్ఐవోలు విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని, వాటి గుర్తింపు రద్దు చేస్తామని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.