: జాతివివక్ష.. ‘బాహుబలి’ టీమ్ తో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు: శోభు యార్లగడ్డ ఆగ్రహం


ఎమిరేట్స్‌ ఈకే526 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన బాహుబ‌లి టీమ్‌తో గేట్ వ‌ద్ద ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ చిత్రం నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విష‌యం గురించి వివ‌రించారు. త‌మ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన సిబ్బంది త‌మ‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు కూడా తన‌కు అనిపించిందని చెప్పారు. తాను తరచూ ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ, త‌నకు ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆయ‌న విమ‌ర్శించారు. ఇటీవల బాహుబలి పబ్లిసిటీ కార్యక్రమం కోసం ప్రభాస్‌, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు ప‌లువురు దుబాయ్‌ వెళ్లిన క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.





  • Loading...

More Telugu News