: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నామంటూ ఫోన్లు చేస్తున్నారు: ఆప్ ఎమ్మెల్యే అల్కా
ఢిల్లీలోని చాందినీ చౌక్ ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు బీజేపీ నేతలు తనతో చెప్పారని ఆమె తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్పినట్టు వెల్లడించారు. ఆప్ పని అయిపోయిందని... ఆ పార్టీని వదిలి బీజేపీలోకి వస్తే, లోక్ సభ టికెట్ ఇస్తామని బీజేపీ తనతో బేరం పెట్టిందని ఆమె తెలిపారు. కేవలం తనకే కాకుండా తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. బీజేపీ నేతలు తనతో మాట్లాడిన విషయాలను ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియాకు తెలిపానని చెప్పారు.