: కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్


హైదరాబాదులోని దుర్గం చెరువుపై నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జ్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. 18 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీ హిల్స్-హైటెక్ సిటీల మధ్య ట్రాఫిక్ తగ్గనుంది. ఈ బ్రిడ్జి పొడవు 365.85 మీటర్లు. రూ. 184 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News