: 'బాహుబలి-2'కి కర్ణాటక ప్రభుత్వం రాయితీ?
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి-2' సినిమాకు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించాయి. కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. టికెట్ కనీస ధరను రూ. 200గా నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. లహరి రికార్డింగ్ సంస్థ ఈ సినిమా ఆడియోను వెలువరించింది. ఈ సంస్థ అధినేత లహరి వేలు మాట్లాడుతూ, 2 నిమిషాల లోపు నిడివి గల కన్నడ టీజర్ ను 60 లక్షల మంది వీక్షించారని చెప్పారు. 'బాహుబలి-2'కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు.