: బీజేపీ విజయానికి ఈవీఎంలే కారణం: ఆప్ ఆరోపణలు
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ ఉదయం ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇదేమీ మోదీ వేవ్ కాదు. ఈవీఎం వేవ్" అని వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా ఓటింగ్ యంత్రాలను మార్చినందునే ఆ పార్టీకి విజయం సాధ్యమైందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కౌంటింగ్ ట్రెండ్స్ ను తమ ఇళ్లలో నుంచి పరిశీలించారు. కాగా, ఎన్నికల ఫలితాల సరళిపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ, ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల ముందున్న ఏకైక ఆప్షన్ బీజేపీయేనని మరోసారి రుజువైందని ఆయన అన్నారు.