: భార్యకు కేన్సర్ చికిత్స చేయించలేక.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి


చేసేది సెక్యూరిటీ గార్డు ఉద్యోగం...భార్యకు ఊపిరితిత్తుల కేన్సర్‌ సోకడంతో ఆమె చికిత్సకు శక్తికి మించి ఖర్చవుతోంది. ఆ వేదన భరించలేకపోయిన సంజయ్ మండల్ అనే వ్యక్తి బహుళ అంతస్తుల భవనం ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఒక సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సంజయ్‌ మండల్‌ భార్యకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకింది. దీంతో ఆమెకు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాడు. ఆయితే ఆమె చికిత్స శక్తికి మించిన భారంగా మారడంతో కోల్ కతాలోని రీజెంట్‌ పార్క్‌ లోని నాలుగంతస్తుల బిల్డింగ్‌ ఎక్కి దానిపై నుంచి కిందికి దూకాడు. దీనిని చూసినవారు వేగంగా స్పందించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 

  • Loading...

More Telugu News