: ప్రభుత్వాన్ని అగౌరవ పరుస్తూ నేనెప్పుడూ మాట్లాడలేదు: గుంటూరు జిల్లా కలెక్టర్


ప్రభుత్వాన్ని అగౌరవపరుస్తూ తానెప్పుడూ మాట్లాడలేదని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తాను తు.చ తప్పకుండా పాటించానని, సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 27న హౌసింగ్ ఎండీగా తాను బాధ్యతలు చేపడతానని అన్నారు. రానున్న రెండేళ్లలో పది లక్షల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని, గుంటూరు జిల్లా కలెక్టర్ గా తాను ఎలాంటి ఇబ్బంది పడకుండా పనిచేశానని అన్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని కాంతిలాల్ దండే అన్నారు.

  • Loading...

More Telugu News