: రోహిత్‌ శర్మ అంపైర్లపై అరవలేదు, దురుసుగా ప్రవర్తించలేదు: హర్భజన్ సింగ్


ఐపీఎల్-10 సీజ‌న్‌లో నిన్న ముంబై ఇండియన్స్ జ‌ట్టు, రైజింగ్ పుణె మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో అంపైర్ తో వాగ్వివాదానికి దిగిన రోహిత్ శర్మకి మ్యాచులో 50 శాతం ఫీజు కోత విధించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ శర్మను హర్భజన్ సింగ్ వెనుకేసుకొచ్చాడు. రోహిత్‌ శర్మ అంపైర్లపై అరవలేదని, దురుసుగా ప్రవర్తించలేదని అన్నాడు. అప్పుడు రోహిత్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగలేదని, కేవలం నిబంధనల గురించి మాత్రమే తెలియజేయాల‌ని చూశాడ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. నిన్న ఈ వివాదానికి కార‌ణ‌మైన బంతి వాస్తవంగా వికెట్లకు చాలా ఎడంగా వెళ్లిందని, ఐతే అది వైడో కాదో తెలీదని వ్యాఖ్యానించాడు. ఒక‌వేళ‌ బ్యాట్స్‌మన్‌ రెండు కాళ్లూ జరిపితే బౌలర్‌కే అనుకూలమ‌ని, కానీ రోహిత్‌ ఒక్కకాలే కదిపాడని వివ‌రించాడు. త‌న‌ అంచనా మేరకు అది వైడేన‌ని, కాక‌పోతే మనం అంపైర్‌ నిర్ణయం ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News