: 'బాహుబలి-2' తొలి షో అప్పుడే పడిపోయిందా?


విజువల్ వండర్ 'బాహుబలి-2' సినిమా కోసం సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు, ఏప్రిల్ 27న (గురువారం) సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా రిలీజ్ కానుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షో పడిపోయిందనేదే ఆ వార్త. సిల్వర్ స్క్రీన్ మీద 'బాహుబలి-2' సినిమా టైటిల్ తో పాటు, ప్రభాస్ స్టిల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ స్టిల్ ఇంతవరకు టీజర్ లో కాని, సాంగ్ ప్రోమోస్ లలో కానీ కనిపించకపోవడంతో... ప్రివ్యూలు ఇప్పటికే ప్రారంభమయ్యాయనే వార్త హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News