: జహీర్ కాబోయే భార్యకు అనిల్ కుంబ్లే మెసేజ్... తాను ఇద్దరు బిడ్డల తల్లినన్న సమాధానం రావడంతో షాక్!
సినీ నటి సాగరికా ఘట్గేతో క్రికెటర్ జహీర్ ఖాన్ కు నిశ్చితార్థం అయిందన్న వార్త బయటకు వచ్చిన తరువాత, ఈ జంటను అభినందిస్తూ పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతుంటే, లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ మాత్రం షాకయ్యాయి. ఇంతకీ జరిగింది ఏమిటంటే, వీరు జహీర్, సాగరికలకు అభినందనలు తెలుపుతూ, పొరపాటున సాగరికా ఘట్గేకు బదులు సాగరికా ఘోష్ కు ట్యాగ్ చేశారు. దీంతో తనకొచ్చిన ట్వీట్ ను చూసిన సాగరిక, "ఊప్స్ రాంగ్ సాగరిక సార్! నేను ఇద్దరు బిడ్డల తల్లిని" అని సమాధానం చెప్పారు. దీంతో తప్పును సరిదిద్దుకున్న కుంబ్లే, డేర్ డెవిల్స్ టీమ్, తిరిగి తమ ట్వీట్లను మార్చుకున్నారు. అనిల్ తొలుత పెట్టిన ట్వీట్, దానికి సాగరిక సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్