: నిన్న ఘాతుకానికి పాల్పడ్డ మావోయిస్టులలో 70% మంది మహిళలే!


చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో నిన్న మావోయిస్టుల దుశ్చర్య కారణంగా 25 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ‌ మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలే ఉన్నారట.  దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉన్న జ‌వాన్ల‌పై పెద్ద ఎత్తున ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు వ‌చ్చి దాడికి దిగార‌ని సంబంధిత అధికారులు చెప్పారు. అక్క‌డి ప్రాంతంలో రోడ్డు వేస్తున్న వారికి ర‌క్ష‌ణ‌గా సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వ‌చ్చార‌ని, అదే స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది.

రోడ్డు వేస్తున్న ప్రాంతం కొంత దిగువన ఉండి, ఎగువన గుట్టలు ఉండటంతో పైనుంచి దాడి చేసిన మావోయిస్టుల‌కు ఆ గుట్టలు రక్షణగా ఉండి, కింద ఉన్నవాళ్లపై సులభంగా దాడి చేసే అవ‌కాశం కలిగింది. ఒక్కసారిగా చుట్టూరా వ‌చ్చేసిన మావోయిస్టులు హేండ్ గ్రనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేసినట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News