: నేడు 11 శాతం దాటనున్న బ్లూరేస్... ఎండలోకి వస్తే చర్మంపై పొక్కులు... హెచ్చరించిన వాతావరణ శాఖ
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల తీవ్రత నేడు మూడు రెట్ల వరకూ అధికంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయట తిరగకుంటే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా సూర్యరశ్మిలో 3 నుంచి 5 శాతం వరకూ బ్లూరేస్ ఉంటాయని, కానీ వాతావరణ మార్పుల నేపథ్యంలో నేడు బ్లూ రేస్ 11 శాతం దాటుతాయని తెలిపారు. దీని ప్రభావం సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుందని వివరించారు. ఈ కిరణాల ధాటికి చర్మంపై పొక్కులు వచ్చే ప్రమాదం ఉందని, వడదెబ్బ బారిన పడవచ్చని హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ ఎండల్లో తిరగవద్దని, తప్పనిసరైన పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.