: ఆ బాటిల్ ను ఎనిమిదేళ్ల తర్వాత సచిన్ ఓపెన్ చేశాడు!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు తన 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ కెరీర్ లో నాడు జరిగిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. 1990.. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లండ్ పై సచిన్ తన తొలి సెంచరీ సాధించిన సంవత్సరం అది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇంగ్లాండుపై శతకాలకు బోణీ కొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా ఓ షాంపేన్ బాటిల్ ను సచిన్ కు బహుమతిగా ఇచ్చారు. అయితే, అది ఓపెన్ చేసి మాత్రం సచిన్ తాగలేకపోయాడు. ఎందుకంటే, అప్పటికి, సచిన్ పదిహేడేళ్ల వాడే. దీంతో, చూడముచ్చటగా ఉన్న ఆ షాంపెన్ బాటిల్ ను దాచుకున్నాడు. అయితే, ఆ షాంపెన్ బాటిల్ ను ఎప్పుడు ఓపెన్ చేశాడో తెలుసా? సచిన్ తన కూతురు సారా టెండూల్కర్ మొదటి పుట్జిన రోజు (1998) వేడుక సందర్భంగా ఓపెన్ చేశాడు.