: తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మోగింది: చంద్రబాబు
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు హర్షం వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మోగిందని చంద్రబాబు అన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాలను ఆయన అందించారని ప్రశంసించారు. శంకరాభరణం, సిరివెన్నెల లాంటి సినిమాలు అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు.