: భల్లాల దేవుడు ‘రానా’ మెడపై కత్తులు పెట్టిన ప్రభాస్, అనుష్క.. మీరూ చూడండి!


ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమా విడుద‌లకు ముందే భ‌ల్లాల దేవుడు రానా మెడ‌పై క‌త్తిపెట్టి బాహుబ‌లి ప్ర‌భాస్, దేవసేన అనుష్క స‌ర‌దాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ దృశ్యం ఈ రోజు ముంబ‌యిలో నిర్వ‌హించిన వ‌రల్డ్ బాహుబ‌లి ఈవెంట్‌లో క‌నిపించింది. వేదిక‌పైకి క‌త్తుల‌తో ప్ర‌వేశించిన ప్ర‌భాస్‌, అనుష్క‌లు అక్క‌డే ఉన్న భ‌ల్లాల దేవుడు రానాకి ఇరువైపులా నించొని, ఆయ‌న గొంతుపై క‌త్తులుపెట్టారు.

ఈ ఫొటోని బాహు‌బ‌లి టీమ్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా కేర‌ళ‌లో 300 థియేట‌ర్ల‌కు పైగా విడుద‌ల కాబోతుంద‌ని, అక్క‌డి 100కు పైగా థియేట‌ర్ల‌లో ఉద‌యం 6 గంట‌ల షో కూడా ఉంటుంద‌ని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాను ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. బాహుబలి-2 ప్రచార కార్యక్రమాల్లో ఆ సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటోంది.

  • Loading...

More Telugu News