: దేశంలోని ఆవులకు, వాటి సంతానానికి ఇకపై ఆధార్‌ నెంబరు!


ప్రభుత్వ పథకాల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టడానికి అన్ని పథకాలకూ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేస్తూ స‌ర్కారు నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయా ప‌థ‌కాల్లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని భావిస్తోంది. అయితే, గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఇదే ప‌ద్ధ‌తిని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని యోచిస్తోంది.

దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఆవుల‌ అక్రమ రవాణా నిరోధానికి ఆధార్‌ను పోలిన ఓ గుర్తింపు సంఖ్యను ఇస్తామ‌ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. ప్రతి ఆవుకూ ఒక నెంబర్‌ను ఇవ్వ‌డ‌మేకాక‌, వాటి సంతానానికి కూడా నెంబర్‌ను కేటాయిస్తామని ఇందుకు సంబంధించిన కమిటీ పేర్కొంది. ఈ నెంబ‌రు జారీ చేయ‌డానికి గోవు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల ఆకారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

  • Loading...

More Telugu News