: సీఎం చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితోనే ముందుకెళ్లాం: ఏపీ డీజీపీ సాంబశివరావు
ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీఆర్ చిట్స్ బాధితులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, బాధిత డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశం, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ కేసు విషయమై ముందుకు వెళ్లామని అన్నారు. ప్రత్యేక కోర్టు సమక్షంలో వీఆర్ చిట్స్ ఆస్తులు వేలం వేశామని, తద్వారా రూ.26 కోట్లు వచ్చాయని అన్నారు. అగ్రిగోల్డ్, అభయా గోల్డ్, బొమ్మరిల్లు సంస్థల బాధితులకూ త్వరలో న్యాయం చేస్తామని సాంబశివరావు తెలిపారు.