: అప్పుడున్న కలెక్టర్ ఒక ఫూల్: మోహన్ బాబు
చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను పరామర్శించడానికే తాను ఇక్కడకు వచ్చానని... రాజకీయాలు చేయడానికి కాదని అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, నిజాలను బయట పెట్టాలని కోరారు. ఇసుక మాఫియా, మెదుగులపాలెం బ్రిడ్జ్ కోసం గతంలో తాను ఎన్నో లేఖలు రాసినా పట్టించుకోలేదని అన్నారు. 'అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఓ ఫూల్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ఉద్యోగి అయినా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.