: సిరియాపై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి


అమెరికా దాడితో బిక్కచచ్చిపోయిన సిరియాపై తాజాగా ఇజ్రాయెల్ దాడి చేసింది. సిరియా వైమానిక శిబిరంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు సిరియా సైనికులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. తమపై కవ్వింపు చర్యలకు దిగినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. తమ ప్రాంతంలోని గోలాన్ హైట్స్ లోకి సిరియా సరిహద్దు బలగాలు మోర్టార్ షెల్స్ తో దాడులు జరిపాయని... ఈ నేపథ్యంలో, సిరియాపై తాము దాడి చేస్తామని శుక్రవారమే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన విషయాన్ని సిరియా ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News