: సోషల్ మీడియా ద్వారానే పోరాటం జరపండి: వైఎస్ జగన్ పిలుపు


పొలిటికల్ పంచ్ ఫేస్‌బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్ రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి, మళ్లీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప‌లు ఆరోప‌ణ‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా ఆఫీసులోనూ పోలీసులు త‌నిఖీలు చేశారు. అయితే, ఈ అంశాల‌పై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు సోషల్ మీడియాను అణగదొక్కుతున్నార‌ని, కానీ, అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని ఆయ‌న అన్నారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌మ పార్టీ మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన అందులో కోరారు.


  • Loading...

More Telugu News