: స్మార్ట్ ఫోన్ కావాలని మా పిల్లలు నాతో గొడవ కూడా పడేవారు: బిల్‌గేట్స్‌


సెల్‌ఫోన్‌ల‌ వ‌ల్ల క‌లిగే దుష్పరిణామాల ప‌ట్ల మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ట‌. ఆ విష‌యంపై త‌న పిల్ల‌ల‌కు ప‌లు ఆదేశాలు కూడా జారీ చేశార‌ట‌. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.... ఫోన్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి నిద్రకు భంగం కలిగిస్తుందని అన్నారు. అందుకే తన పిల్లలకి 14 ఏళ్లు వచ్చేవరకూ స్మార్ట్‌ఫోన్లు ఇవ్వలేదని తెలిపారు. అంతేకాదు, తాము డిన్నర్‌ టేబుల్‌ వద్ద ఫోన్లు వాడబోమ‌ని తెలిపారు.

త‌న‌ పిల్లలు వారి స్నేహితులకు 14 ఏళ్లు రాకముందే ఫోన్లు వచ్చాయని, త‌మ‌కు కూడా కావాల‌ని త‌న‌తో గొడవ కూడా పడేవారని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను త‌మ పిల్ల‌ల‌కు 14 ఏళ్లు నిండేవ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌లు కొనివ్వ‌లేద‌ని తెలిపారు. ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం అధిక‌మై ఎంతో మంది యువత సరిగ్గా నిద్రపోవడం లేదని ఆయ‌న అన్నారు. తాను తన ముగ్గురు పిల్లలు జెన్నిఫర్‌, రోరీ, ఫీబీలకి ఈ విష‌యంలో ఇప్ప‌టికీ ప‌లు సూచ‌న‌లు చేస్తాన‌ని, సాయంత్రం అవగానే వారి ఫోన్ల‌ని స్లీప్‌మోడ్‌లో పెట్టేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News