: కాలేజీలో రసాయన శాస్త్రం బోధించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవలే ఓ పాఠశాలలో తెలుగు పాఠాలు బోధించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన మరోసారి టీచర్ అవతారం ఎత్తారు. వరంగల్ లోని ఎస్వీఎస్ కాలేజీలో విద్యార్థులకు ఎంసెట్ పరీక్షలో స్కోరింగ్ సాధించడం సహా రసాయన శాస్త్రంలో మెలుకువలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి రాకముందు రసాయన శాస్త్ర అధ్యాయపకుడిగా పనిచేశానని చెప్పారు. అంతకు ముందు బ్యాంకు ప్రొబెషనరీ అధికారిగా పనిచేశానని చెప్పారు. అక్కడ అధిక జీతం వస్తున్నప్పటికీ టీచింగ్‌పై ఉన్న ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి లెక్చరర్ గా పనిచేశానని అన్నారు. ఈ రోజు ఆయన రసాయన మూలకాలు, వాటి బంధాలు, మూలకాల ఆకృతులు, హాలోజన్స్, అమ్మోనియం క్లోరైడ్, పోటాషియం పర్మాంగనేట్ తదితర అంశాలపై ఆయన వివరించి చెప్పారు. పాఠాలు చెప్పడం ద్వారా ఈ రోజు రూ.2 లక్షలు సంపాదించానని వాటిని టీఆర్ఎస్ సభకు వినియోగిస్తానని అన్నారు.