: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీ దేవి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహిళా నేత పాముల రాజేశ్వరీ దేవి చేరారు. ఈ ఉదయం తన అనుచరులతో కలసి హైదరాబాద్ కు వచ్చిన ఆమె, లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసి, ఆ పార్టీ జెండాను భుజాన వేసుకున్నారు. జగన్ స్వయంగా ఆమెను పార్టీలోకి స్వాగతం పలికారు. రాజేశ్వరీ దేవి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. కాగా, రాజేశ్వరీ దేవి పీ గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.