: విదేశాలకు వెళ్లాలి.. అనుమతించండి: మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కుష్బూ


ప్రముఖ సినీ నటి ఖుష్బూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబసభ్యులతో కలసి విదేశాలకు విహారయాత్రకు వెళుతున్నానని... తన ప్రయాణానికి అనుమతి తెలపాలని కోర్టుకు విన్నవించారు. అయితే, ఏ దేశానికి వెళుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియ జేయాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో, ఈ నెల 24 నుంచి మే 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు వెళుతున్నట్టు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై త్వరలోనే న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలో ఖుష్బూపై కేసు నమోదైంది. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉన్నందున ఆమె పాస్ పోర్టును రెన్యువల్ చేయడానికి అధికారులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే, ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News