: నాణ్యతలేని కాంబిఫ్లామ్, డీ-కోల్డ్: కేంద్రం డ్రగ్ అలర్ట్


జ్వరం, ఒళ్లు నొప్పులు జలుబు వస్తే, ప్రజలు అత్యంత సాధారణంగా మెడికల్ షాపునకు వెళ్లి పేరు చెప్పి కొనుక్కునే కాంబిఫ్లామ్, డీ-కోల్డ్ ఔషధాలు ఎంతమాత్రమూ నాణ్యత లేనివని కేంద్ర ప్రభుత్వ సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) పేర్కొంది. ప్రముఖ ఔషధ సంస్థలు సనోఫీ, రికెట్ బెన్కైజర్ హెల్త్ కేర్ లు తయారు చేస్తున్న ఈ ఔషధాలతో పాటు మొత్తం 60 ఔషధాలపై డ్రగ్ అలర్ట్ ప్రకటించింది.

గత నెలలో ఈ ఔషధాలపై పరీక్షలు నిర్వహించిన సీడీఎస్సీఓ, వాటి నాణ్యత సక్రమంగా లేదని, వీటిని వాడటం వల్ల సమస్యలు తప్పవని తేల్చింది. సిప్లా విక్రయిస్తున్న ఓఫ్లాక్స్ - 100 డీటీ, థియో ఆస్థలిన్ టాబ్లెట్లు, కాడిలా విక్రయించే కాడిలోజ్ సొల్యూషన్ కూడా నాణ్యతలేనివేనని తెలిపింది. ఈ ఔషధాలన్నీ క్వాలిటీ పరీక్షల్లో విఫలమయ్యాయని వెల్లడించింది. ఈ వార్తపై స్పందించిన సనోఫీ, సీడీఎస్సీఓ నుంచి అధికారిక నోటీసులు వచ్చిన తరువాత స్పందిస్తామని తెలిపింది. ఏ బ్యాచ్ నంబరుకు చెందిన ఔషధాలను పరీక్షించారో చూడాల్సి వుందని పేర్కొంది. మిగతా కంపెనీలు స్పందించాల్సివుంది.

  • Loading...

More Telugu News