: మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా కింద మరో 5 లక్షలిస్తాం: నారా లోకేష్


వైసీపీ నేతలపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఎంత సేపు శవ రాజకీయాలు చేయడం తప్ప వీరికి మరోపని లేదని విమర్శించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఓ లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం తాగి... 20 మంది ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు లోకేష్, నారాయణ, అమర్ నాథ్ రెడ్డి, మాణిక్యాలరావులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని... చంద్రన్న బీమా పథకం ద్వారా మరో రూ. 5 లక్షలు అందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News