: ముందే ఎన్నికలు వస్తే నా 'సేన' రెడీ: పవన్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని, వైకాపా నుంచి వచ్చిన వారితో సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులకు చెప్పిన వేళ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ముందస్తు ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. "ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందస్తుగా వస్తే , జన'సేన' సిద్దమే" అని ఈ ఉదయం 10:25 గంటల సమయంలో ట్వీట్ పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ అయింది.
ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే.
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2017