: లోకేష్, కళా వెంకట్రావులు కాదు.. ఇకపై అన్నీ నేనే చూసుకుంటా: చంద్రబాబు
నారా లోకేష్, కళా వెంకట్రావులు మంత్రులుగా బాధ్యతలను స్వీకరించడంతో... పాలనా వ్యవహారాల్లో వారు బిజీ అయిపోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇకపై తానే చూసుకుంటానని ఆయన చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రెండు మూడు గంటల సేపు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. వారంలో కనీసం ఐదు రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మంత్రులుగా కొత్తగా బాధ్యతలను స్వీకరించినవారు సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఇతరులను కలుపుకుని పోవాలని సూచించారు.