: 'మహాభారతంలో మహేష్' వార్త ఫేక్!
దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బీఆర్ శెట్టి నిర్మాతగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న 'మహాభారతం' చిత్రంలో శ్రీకృష్ణుడిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని వచ్చిన వార్తలు అబద్ధమని వెల్లడైంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ బాబే శ్రీకృష్ణుడని, చిత్ర నిర్మాతలు ఆయన్ను సంప్రదించారని వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు మహేష్ మేనేజర్ ను వివరణ కోరగా, ఆయన ఈ వార్త పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రంతో మహేష్ బిజీగా ఉన్నారని, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తారని తెలిపారు. మహాభారతంలో ఆయన నటించడం లేదని, అసలా ప్రతిపాదనే మహేష్ దగ్గరికి రాలేదని స్పష్టం చేశారు.