: మంత్రుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!


రాష్ట్ర వ్యాప్తంగా నీరు - ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తాను ఆదేశాలు జారీ చేస్తే కొందరు మంత్రులు పాల్గొనకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఏ మంత్రి ఏ పని చేస్తూ, నీరు - ప్రగతికి దూరంగా ఉన్నారన్న విషయాన్ని చదివి వినిపించారు. వయసు పైబడిన రీత్యా కేఈ కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి వెళ్లలేదని తెలిపారు. యనమల రామకృష్ణుడు విజయవాడలోనే ఉండిపోయారని, అచ్చెన్నాయుడు తన జిల్లాలో ఉండి కూడా కార్యక్రమానికి వెళ్లలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను చెప్పినా కూడా మంత్రులు పుల్లారావు, ఆనందబాబు, శిద్ధా రాఘవరావులు జిల్లా కేంద్రాల్లోనే ఉండి గ్రామాలకు కదల్లేదని గుర్తు చేశారు. తన శాఖ కార్యక్రమం 'బడికొస్తా' అన్న దానిని పట్టుకుని గంటా ఉండిపోయారని ఇలా చేస్తే ఎలాగని బుద్ధి చెప్పారు. ఇంకోసారి తేడా జరిగితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News