: బలూచిస్థాన్ లో ఆయుధాలు వదిలేసి.. లొంగిపోయిన 400 మంది ఉగ్రవాదులు!
వరుస ఉగ్రవాడులతో అట్టుడుకుతున్న పాకిస్థాన్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలసిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో, బలూచిస్థాన్ అసెంబ్లీలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బలూచ్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీ, సీనియర్ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెహ్రీ మాట్లాడుతూ, ఉగ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. లొంగిపోయిన ఉగ్రవాదుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీలతో పాలు ఇతర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.