: ఏర్పేడు ప్రమాద ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద లారీ సృష్టించిన బీభత్సం కారణంగా 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంత మందికి చికిత్స అందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను కలచివేసిందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలను సర్కారు ఆదుకోవాలని ఆయన అన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన కోరారు.