: త‌న ఫ్రెండ్స్ కోసం నాగ‌చైతన్యతో స్నాక్స్ చేయించిన స‌మంత!


త‌నకు కాబోయే శ్రీ‌మ‌తి కోసం సీనీన‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రోసారి వంట చేసిపెట్టాడు. గ‌తంలోనూ స‌మంత కోసం ఓ సారి చైతూ వంట చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా, స‌మంత సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసి, చైతూతో హ్యాపీగా ఉన్న‌ట్లు తెలిపింది. ''నాకు ఇది ఉంటే.. జీవితంలో అంతా ఉన్నట్లే'' అని ఒక క్యాప్షన్ పెట్టి, త‌న‌కు కుటుంబమే సమస్తమని, చైతూ పట్ల తనకు ల‌వ్‌, గౌరవం, కృతజ్ఞత అన్నీ ఉన్నాయని హ్యాష్ ట్యాగ్‌లను జోడించింది.

సమంత తన స్నేహితురాళ్ల‌ని తీసుకొచ్చి, నాగ‌ చైతన్యతో వాళ్ల కోసం స్నాక్స్ చేయించి ఇచ్చింది. ప్రేమమ్ సినిమాలో నాగ‌చైత‌న్య‌ చెయ్యి తిరిగిన చెఫ్‌గా నటించిన విష‌యం తెలిసిందే. అచ్చం అలాగే ఎంతో అనుభ‌వంగ‌ల వంట‌వాడిగా చైతూ వంట చేశాడు. స్నాక్స్‌ను తయారుచేసి సమంత స్నేహితురాళ్లకు ఇచ్చాడు. స‌మంత పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చైతూ ప‌క్క‌న‌ ఉండి కూరగాయలు కట్ చేసి ఇస్తోంది, మ‌రో ఫొటోలో త‌న‌కు కాబోయే శ్రీ‌వారిని వెనక నుంచి హగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించి సమంత పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News