: ‘ఇంగ్లీషు’ నేర్చుకుంటానంటున్న శశికళ!
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ .. ఇంగ్లీషు భాష నేర్చుకునేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ వయసులో, అదీగాక .. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ‘ఇంగ్లీషు’ నేర్చుకోవాలనే ఆలోచన ఆమెకు ఎందుకు కలిగిందనే అనుమానం తలెత్తకమానదు. అందుకు.. కారణం లేకపోలేదు. శశికళ తన ఆత్మకథను రాసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఆమెకు ‘తమిళం’ తెలిసినంతగా ‘ఇంగ్లీషు’ రాదు. దీంతో, ఇంగ్లీషు భాష నేర్చుకోవాలని అనుకున్న శశికళ, ఈ మేరకు పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు విన్నవించుకున్నారు. ఆమె వినతిని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.