: విచారణలో పలు విషయాలు చెప్పిన రవికిరణ్... జగన్ మీడియా సంస్థ హస్తంపై ఆధారాలు!


నారా లోకేష్ పై ఫేస్ బుక్ లో వ్యక్తిగత దూషణలకు దిగుతూ కార్టూన్లను పోస్టు చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన, ఇంటూరి రవికిరణ్ ను విచారించిన పోలీసులు, ఈ మొత్తం బాగోతం వెనుక వైఎస్ జగన్ కు చెందిన మీడియా ఉందని తెలుసుకున్నట్టు సమాచారం. వైసీపీ సోషల్ మీడియా టీమ్ వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు, వీరికి ఆయన సంస్థ నుంచి వేతనాలు అందుతున్నట్టు విచారణలో తెలుసుకున్న పోలీసులు, ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఫేస్ బుక్ లో 'పొలిటికల్ పంచ్' అనే పేజీని నిర్వహిస్తున్న రవికిరణ్, లోకేష్ పై పెడుతున్న సెటైర్లు, కార్టూన్లపై మండలి చైర్మన్ చక్రపాణి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News