: ఎట్టకేలకు కన్నడిగులకు క్షమాపణ చెప్పిన కట్టప్ప!
ఎట్టకేలకు కట్టప్ప దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వ్యాఖ్యలు చేసినందున, 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాన్ని కన్నడనాట విడుదల చేయనివ్వబోమని పలు సంఘాలు భీష్మించుకుని కూర్చున్న వేళ, కొద్దిసేపటి క్రితం సత్యరాజ్ ఓ ప్రకటన చేశారు. తాను కన్నడ ప్రజలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన వల్ల బాహుబలి వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమాను ప్రతి ఒక్కరికీ చేర్చాల్సి వుందని అన్నారు. కన్నడ ప్రజలంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో తన వ్యాఖ్యల పట్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.