: ప్రైవేటు జెట్ కొన్న పంజాబీ సింగర్ కమ్ బాలీవుడ్ నటుడు
పంజాబీ గాయకుడు మరియు నటుడైన దిల్ జీత్ దోసాన్జ్ 'ఉడ్తా పంజాబ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం అనుష్క శర్మ నిర్మాతగా వ్యవహరించి నటించిన 'ఫిల్హౌరీ' సినిమాలో కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత కలర్స్ టీవీ ఛానెల్ లో లైవ్ సింగింగ్ షో 'రైజింగ్ స్టార్ ఇండియా'తో దేశవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో వార్తతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. దిల్ జీత్ దోసాన్జ్ ఇప్పుడు ప్రైవేటు జట్ కొనుగోలు చేశాడు. ఈ విషయం అభిమానులకు చెబుతూ, ‘ప్రైవేటు జెట్ తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. దిల్జీత్ త్వరలో తన టీమ్ తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్) నిర్వహించబోతున్నాడు. వాంకోవర్, ఎడ్మంటన్, విన్నిపెగ్, టోరంటోల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆ షోలకు సంబంధించిన టికెట్లు అమ్ముడైపోయినట్టు తెలుస్తోంది.
New Beginning Starts With Private Jet