: డబ్బింగ్ సీరియళ్ళపై ఎస్పీ బాలు సంచలన వ్యాఖ్యలు


డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేసి తమ పొట్టకొట్టొద్దని తెలుగు టీవీ కళాకారులు హైదరాబాద్ లో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, డబ్బింగ్ సీరియళ్ళ విషయంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బింగ్ సీరియళ్ళను ప్రసారం చేయొద్దనడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనువాద ధారావాహికల కారణంగా ఉపాధి కోల్పోతున్నామని తెలుగు బుల్లితెర కళాకారులు భావించడాన్ని బాలు తప్పుబట్టారు. ఆర్టిస్టులు విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. సీరియల్ లో పసలేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్లు ఉన్నా ఆ సీరియల్ ను చూడరని బాలు అన్నారు.

  • Loading...

More Telugu News