: బీర్ల లోడ్ తో వెళుతున్న లారీ బోల్తా.. పండగ చేసుకున్న బీరుబాబులు!


బీర్లు లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టిన సంఘటన బెంగళూరులో జరిగింది. తుమకూరు తాలూకాలోని నందిహళ్లి వద్ద జాతీయరహదారిపై వెళ్తున్న ఈ లారీ అదుపు తప్పి, కారును ఢీ కొట్టింది. దీంతో, లారీలోని బీర్ బాటిళ్లు కింద పడి పగిలిపోవడంతో భారీ నష్టం జరిగింది. కాగా, ఈ రహదారిపై ప్రయాణిస్తున్నవారు తమ వాహనాలను ఆపి చేతికి అందిన బీరు బాటిళ్లను తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంతో రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

  • Loading...

More Telugu News